Header Banner

ఓరుగల్లులో మిస్ వరల్డ్ అందాల భామల సందడి.. ప్రభుత్వ ప్రత్యేక వీడియో విడుదల..

  Tue May 13, 2025 21:32        Devotional

తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీల సందడి నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర ఘన చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వీరి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల సుందరీమణులు తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించనున్నారు. బుధవారం వారంతా యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణకు విచ్చేసిన ఈ అందగత్తెలకు సాదర స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, చారిత్రక వైభవాన్ని వారికి పరిచయం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి మరింత ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations